Wednesday, 4 November 2026

ప్లేట్‌లో బల్లి

మునిపల్లి: మండలంలోని లింగంపల్లి ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఉదయం అల్పాహారం సాంబారు(సబ్జి)లో బల్లి రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. 7వ తరగతి చదువుతున్న గణేశ్‌ అనే అనే విద్యార్థి ప్లేట్‌లో పూరీ వేసుకుని, గరిటెతో సాంబారును వేసుకుంటుండగా, ప్లేట్‌లో బల్లి పడింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటికే పలువురు విద్యార్థులు సాంబారు తిన్నారు. విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌కు సమాచారమిచ్చినా పాఠశాలకు రాలేరు. ఆదివారం సెలవు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను చూసేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న వారు ఆందోళన చెందారు. నెలరోజుల క్రితం పాఠశాల వద్ద ఉన్న తాగునీటి బావిలో కుక్క మృతి చెందిందని, అట్టి నీటినే మూడు రోజుల పాటు విద్యార్థులకు తాగడానికి సరఫరా చేశారని వారు ఆరోపించారు. ఆహారంలో బల్లి పడిన విషయాన్ని ప్రిన్సిపాల్‌కు తెలిపినా రాలేదని వారు ఆరోపించారు. ఈ విషయమై హాస్టల్‌ వార్డెన్‌, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *