ఖైరతాబాద్: డబ్బులేకుండా చదువుకెవ్వరూ దూరం కాకూడదనే లక్ష్యంతో తాము కృషిచేస్తున్నామని, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే ధ్యేయమని స్వేచ్ఛాఫౌండేషన్ తెలిపింది. ఆదివారం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు విద్యార్థులు, ఫౌండేషన్ ప్రతినిధులు కలసి 2కే వాక్ నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థను అంతమోందిస్తామనే ప్లకార్డులు ప్రదర్శించారు. యాంకర్ ప్రవీణ్ మాచిరాజు ఈ వాక్‌ను ప్రారంభించగా సినీనటుడు రాహుల్ రవిచంద్రన్ పాల్గొన్నారు. స్వేచ్ఛా ఫౌండేషన్ అధ్యక్షుడు కార్తికేయా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గణితం, సైన్స్‌లలో పరీక్షలు నిర్వహించి, ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు నగదు బహుతులను ఇస్తున్నామని తెలిపారు.




