Wednesday, 4 November 2026

ఖైరతాబాద్‌ లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పర్యటన

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడితే రోడ్లపై ఎడ్యుకేషన్‌, సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ సెంటర్ల పాంప్లెట్‌లు వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై పాంప్లెట్లు వేసే సంస్థలనుమొదట హెచ్చరిస్తామని అయినా తీరు మారకుంటే రూ.10వేల జరిమానా విధిస్తామన్నారు. అయినా వినకుంటే మూడోసారి రూ.20వేల జరిమానాతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామన్నారు. అలాగే అమీర్‌పేట మైత్రీవనం దగ్గర మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనుమతి లేకుండా ప్రకటనలు, సంస్థల నేమ్‌ బోర్డులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని సోమేష్‌కుమార్‌ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *