గంగపుత్ర వీధి బోర్డును ఏర్పాటు చేయండి
-గంగపుత్ర జిల్లా అధ్యక్షులు మైస నాగయ్య
మహబూబాబాద్ బ్యూరో-డిసెంబర్15(జనంసాక్షి)
అనేక సంవత్సరాలుగా 200 కుటుంబాలు మానుకోట పట్టణంలోని 27వ వార్డు నివాసం ఉంటున్న గంగపుత్ర బజార్ (బెస్త) నామకరణం గల బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని గురువారం మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణికి వినతి పత్రం అందజేశారు. గంగపుత్రుల అభివృద్ధికి సహకరించాలని ఆమెను కోరారు. గంగపుత్ర జిల్లా అధ్యక్షులు మైస నాగయ్య, పట్టణ అధ్యక్షులు దేశబోయిన వెంకటస్వామి హాజరై మాట్లాడుతూ మానుకోట పట్టణంలో బెస్త బజార్ పేరునటువంటి ఏరియాకు ఇప్పటివరకు బెస్త బజార్ నామకరణ బోర్డు లేకపోవడం బాధాకరమని ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా తక్షణమే గంగపుత్ర బెస్త బజార్ బోర్డును ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ గంగపుత్ర సంఘం కోశాధికారి దేశబోయిన అనిల్ కుమార్, ఆవారి సునీల్, చుక్కల నరేష్ తదితరులు పాల్గొన్నారు.




