Thursday, 5 November 2026

కమ్యూనిస్టు ఉద్యమంలో నారాయణ కీలకపాత్

కమ్యూనిస్టు ఉద్యమంలో నారాయణ కీలకపాత్ర
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

జూలూరుపాడు, డిసెంబర్ 15, జనంసాక్షి: జూలూరుపాడు గ్రామానికి చెందిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లంకి నారాయణ ఇటీవల కన్నుమూశారు. గురువారం సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సంతాప సభకు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎల్లంకి నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం శ్రమించిన నిజాయితీగల నాయకుడిని కోల్పోవడం బాధాకరంగా ఉందని అన్నారు. ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమంలో నారాయణ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని, ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శులు పోటు ప్రసాద్, ఎస్కే సాబీర్ పాషా, వైరా నియోజకవర్గ కన్వీనర్ ఎర్రబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్, కొండపర్తి గోవిందరావు, మాజీ జడ్పిటిసి దొండపాటి రమేష్, రంజిత్ కుమార్, వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ విజయభాయి, చింత స్వరాజ్యరావు, ఈసం నరసింహ, నాగుల్ మీరా, గుండెపిన్ని మధు, వెంకటేశ్వర్లు, యాస రోశయ్య, కొండా వీరయ్య తదితరులు పాల్గొన్నారు.