హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లోని రుషికేష్ వద్ద గంగానదిలో గల్లంతైన బాల నటుడు తేజ మృతదేహం లభ్యమైంది. ఈ నెల 5న కళాశాలకు చెందిన 25 మంది సభ్యుల బృందంలో రుషికేష్ వెళ్లిన తేజ గంగానదిలో దిగి గల్లంతయ్యాడు. అక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి రుషికేష్‌లోని సాయిఘాట్లో బాటుడి మృత దేహాన్ని గుర్తించరు.శవపరీక్ష అనంతరం రేపు తేజ మృతదేహాన్ని హైదరాబాద్‌కు కుటుంబసభ్యులు తీసుకురానున్నారు. మురారి, కథానాయకుడు, రామదండు తదితర చిత్రాల్లో తేజ నటించాడు.




