గంగారం గ్రామం లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన
యఫ్ టీవీ అధినేత
పాడి ఉదయ్ నందన్ రెడ్డి
వీణవంక ఆగస్టు 27 ( జనం సాక్షి ) వీణవంక మండలంలోని గంగారం గ్రామానికి చెందిన సాగంటి సంతోష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అనంతరం యఫ్ టీవీ
అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆర్థిక సహాయంగా ఆది వారం తన అనుచరుల చేత 5 ఐదు వేల రూపాయలు ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం అంద చేశారు . కుటుంబ సభ్యులు యఫ్ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీణవంక మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు కాసం వీరారెడ్డి. మండల సమన్వయ సమితి అధ్యక్షుడు నరహరి తిరుపతి రెడ్డి. దాసరపు లోకేష్
అమృత ప్రభాకర్. సమీళ్ల ప్రకాష్. దాసారపు వంశీకృష్ణ.సాగంటి తిరుపతి. సాగంటి చంద్ర శేఖర్. గాజుల నాగరాజు. తో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.