ధర్మపురి నియోజకవర్గం లో బహుజన జండా ఎగరబోతుంది

నక్క విజయ్ కుమార్ ధర్మపురి ( జనం సాక్షి)పెగడపల్లి మండలంలోని దేవికొండ గ్రామం బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జెండా గద్దె ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ నక్క విజయకుమార్ కు నంచర్ల గ్రామం మీదుగా భారీ బైక్ ర్యాలీ తో డప్పుల తో ఘన స్వాగతం పలికారు గ్రామంలోకి చేరుకొని నక్క విజయ్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం వారు మాట్లాడుతూ, గ్రామ కమిటీకి కృతజ్ఞతలు తెలిపి రానున్నది బహుజన రాజ్యమేనని బహుజన రాజ్యం వస్తేనే 93% ఉన్న బడుగు బలహీన వర్గాల బాధలు తీరుతాయని, తెలంగాణ వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయినా ఏ ఆకాంక్షతో తెలంగాణను సంపాదించుకున్నాము అవేవీ తీరకపోగా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సబ్ ప్లాన్ నిధులు వారు ఇష్టారాజ్యముగా పార్టీ కోసం వినియోగించుకుంటున్నారని, వారు మాత్రమే సిరిసంపదలకు దగ్గరయి బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఇంకా పేదరికం అనుభవిస్తూనే ఉన్నారు. బందు స్కీములు కాదు కావాల్సింది భవిష్యతని 12 శాతం ఉన్న యాదవులకు చట్టసభల్లో స్థానం కల్పించకపోవడం శోచనీయమని దొర అహంకారానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు, బహుజన్ సమాజ్ పార్టీ బీసీలకు 70 అసెంబ్లీ సీట్లు కేటాయించి బహుజనుల బ్రతుకులను మార్చాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారి అత్యున్నతమైన పదవికి రాజీనామా చేసి పల్లె పల్లెకు వెళుతున్నారని,ధర్మపురి గడ్డమీద బహుజన జెండా నే అని అంటూ, వైన్స్ ల మీద ఉన్న చిత్తశుద్ధి ఉద్యోగ నియామకాల మీదుంటే బాగుండేది. చేతనైతే రానున్న ఎలక్షన్ లో కొప్పుల ఈశ్వర్ చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షుడు కుషనపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు బచ్చల స్వామి కోశాధికారి దీకొండ రాజు సీనియర్ నాయకులు శంకరన్న పెగడపల్లి మండల అధ్యక్షుడు గొడుగు నరేష్ ఎండపల్లి మండల అధ్యక్షుడు కార్తీక్ గొల్లపల్లి మండల అధ్యక్షుడు కల్లపల్లి తిరుపతి సోషల్ మీడియా ఇంచార్జ్ మద్దెల రాజశేఖర్, అంజి ఎస్ ఎస్ యు జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అజయ్ బివిఎఫ్ కన్వీనర్ రేగుంట వెంకటేష్ అజయ్ నరేష్ తాడూరి రమేష్ మహంకాళి అక్షయ్ మహంకాళి అరవింద్, వినయ్ సాయి, రాజు ,అజయ్ వేల్పుల హారిక ,తాడూరు సోనీ ,అనిత పూజ ,దివ్య ,విజయ ,శ్యామల మల్లేష్ ,సురేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.