జుక్కల్, జూన్ 29,(జనంసాక్షి),గంజాయి పండిస్తే కేసులు నమోదు చేస్తామని బాన్సువాడ డిఎస్పి జగన్నాధ రెడ్డి అన్నారు.డిఎస్పీ అధ్వర్యంలో కామరెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలం పోచారం తండాలో గురువారం కార్డెన్ సర్చ్ నిర్వచించారు. గంజాయి రవాణా చేయడం, పండించడం నేరమని డిఎస్పీ తెలిపారు. ఎవరైనా గంజాయిని పండించిన, రవాణా చేసిన, రవాణా చేసే వారికి సహాయపడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ అవేర్నెస్ గురించి వివరించారు .హెల్మెట్ ధరించాలని, లైసెన్సు తీసుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో బిచ్కుంద సిఐ కృష్ణ, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పెద్దకొడప్గల్ ఎస్సైలు వరుసగా కృష్ణారెడ్డి,మురళీ,శ్రీదర్ రెడ్డి, కోనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
గంజాయి పండిస్తే కేసులు నమోదు చేస్తాం బాన్సువాడ డిఎస్పి జగన్నాధ రెడ్డి




