Monday, 2 November 2026

తొలి ఏకాదశి పూజల్లో పాల్గొన్నా సిఐ రవీందర్ రెడ్డి

జనంసాక్షి(రుద్రుర్): రుద్రుర్ మండలంలోని పలు గ్రామాల్లోని విష్ణు దేవాలయాల్లో తొలి ఏకాదశి పూజలను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుద్రుర్ లోని విఠలేశ్వర్ మందిర్ వద్ద ఉదయం నుండే అభిషేకం నిర్వహించి అనంతరం విశేష అలంకరణ జరిపి పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. ఉదయం పూజ కార్యక్రమంలో రుద్రుర్ సిఐ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు , ఉదయం నుండి అర్చకులు రాజు, నారాయణ, శ్రీకాంత్ పంతులు వేద మంత్రాలను చదువుతో భక్తులకు తీర్థప్రసాదాలు పంచితొలి ఏకాదశి విశేషాలను తెలియజేసారు.