రాయదుర్గం: హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థల ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో శనివారం ఉదయం ఎకో ఫ్రెండ్లీ సైకిల్ రైడ్ నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఏండీ ఎన్‌వీఎస్ రెడ్డి, ప్రముఖ షట్లర్ పీవీ సింధు జెండా వూపి రైడ్‌ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం కార్యక్రమం నిర్వహించినట్లు హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్‌అధ్యక్షుడు డీవీ మనోహర్ తెలిపారు. వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థలకు చెందిన 500 మంది ఉద్యోగులు రైడ్‌లో పాల్గొన్నారు.
గచ్చిబౌలిలో ఎకో ఫ్రెండ్లీ సైకిల్ రైడ్ …




