Tuesday, 3 November 2026

గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం

హైదరాబాద్‌: అతి భారీ వర్షాలతో కోస్తాంధ్ర జలవిలయంలో చిక్కుకుంది. ఉత్తరాంధ్రపై కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తా ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకూ అతిభారీ వర్షాలు కురిశాయి. ఈ ఉదయం ఎనిమిదన్నర గంటల వరకూ అత్యధికంగా  పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 31 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇతర ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

అమలాపురం: 27 సెం.మీ

రాజమండ్రి: 25 సెం.మీ

కాకినాడ: 20 సెం.మీ

కోడేరు: 23 సెం.మీ

యలమంచిలి:25 సెం.మీ

చోడవరం: 22 సెం.మీ

నర్సీపట్నం: 21 సెం.మీ

అనకాపల్లి: 18 సెం.మీ

విజయనగరం: 19 సెం.మీ

తణుకు, విశాఖ, భీమిలిపట్నం, పెద్దాపురం: 18 సెం.మీ

రణస్థలం, తాడేపల్లిగూడెం, సంగవరపుకోట, నర్సాపురం: 16సెం.మీ

పత్తిపాడు,విశాఖ ఎయిర్‌పోర్టు: 15 సెం.మీ

భీమవరం, పోలవరం: 12 సెం.మీ

గుడివాడ: 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

రాబోయే 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *