గడ్డన్నవాగు ప్రాజెక్టులో రోయ్య పిల్లలు విడుదల…
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 26
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గడ్డన్నవాగు ప్రాజెక్టులో శనివారం రొయ్య పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ… మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో రకాలుగా కృషి చేస్తుందని అన్నారు. 13 లక్షల 58వేల రొయ్య పిల్లలను అధికారుల సమక్షంలో అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీ మెంబర్స్ రొయ్య పిల్లలను ప్రాజెక్టులో వదిలారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఇన్చార్జి డిఎఫ్ఓ వై. విజయకుమార్, అబ్జర్వర్ ఇన్చార్జి డి ఎఫ్ ఓ వరదా రెడ్డి, కడెం ఎఫ్.డి.ఓ సుమలత, బైంసా ఎఫ్ఎస్సి అధ్యక్షులు దత్తు, ఉపాధ్యక్షులు కాశీనాథ్, కమిటీ మెంబర్స్ పి.భోజన్న, పోతన్న,పవన్ పాల్గొన్నారు.




