Tuesday, 3 November 2026

గడ్డి అన్నారంలో అధికారుల పర్యటన

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను నీతి ఆయోగ్‌, ఐటీ అధికారులు సందర్శించారు. మార్కెట్‌ లో క్రయవిక్రయాలు జరుగుతున్న తీరును రైతులు, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో వేలం నిర్వహణ తీరుపై చర్చించిన అధికారులు.. అన్ని విభాగాలను ఐటీతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ రామ నర్సింహా గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.