Wednesday, 4 November 2026

గడ్డెన ప్రాజెక్టులో మునిగి వ్యక్తి మృతి

భైంసా: ఆదిలాబాద్‌ జిల్లా భైంసా పట్టణం లోని కుంట ప్రాంతనికి చెందిన ఫరూక్‌(22) అనే యువకుడు గడ్డెన ప్రాజెక్టులలో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. ఫరూక్‌ స్నేహితుడు సయ్యద్‌ ఆసిఫ్‌తో కలిసి స్నానం చేసేందుకు ఆదివారం గడ్డెన ప్రాజెక్టుకు వెళ్లారు. ఫరూక్‌.. ముంఉగా నీటిలోకి దిగాడు. ఫరూక్‌ ఎంత సేపటికి బయటకి రాక పోవడంతో ఒడ్డు పైన వున్న సయ్యద్‌ ఆసిఫ్‌ ఆందోళన చెంది అపస్మారక స్థితిలో అక్కడే పడి పోయాడు. సయ్యద్‌ను గుర్తించిన స్థానికులు హుటాహుటిన ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఫరూక్‌ నీటిలో మునిగి పోయిన విషయాన్ని గమనించి గాలించగా మృతదేహం బయటపడింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *