గణితమేళను ఏర్పాటుచేయడం అభినందనీయం.
– తాళ్ళగురిజాల ఎస్సై రాజశేఖర్.
– బెల్లంపల్లి సిఓఈ లో ఘనంగా మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్.
– ఆకట్టుకున్న విద్యార్థుల క్యూబ్ ప్రదర్శన.
ఫొటో : గణిత మేళ ప్రారంభిస్తున్న ఎస్సై రాజశేఖర్.
2) గణిత ప్రదర్శన వివరిస్తున్న విద్యార్థులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 22, (జనంసాక్షి )
ఆలోచనాత్మకంగా గణితమేళ ను ఏర్పాటుచేయడం అభినందనీయమని తాళ్ళగురిజాల ఎస్సై రాజశేఖర్ అన్నారు. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ(సిఓఈ) బెల్లంపల్లి లో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన గణితమేళా ను ప్రారంభించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్త, భారతీయ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ పుట్టిన రోజైన డిశంబర్ 22 ను జాతీయ గణితదినోత్సవంగా జరుపు కుంటూ విద్యార్థులు తమకు తాముగా స్ఫూర్తి పొందడం గొప్ప విషయమన్నారు. మాథ్స్ డిపార్ట్ మెంట్ అద్యర్యం లో ఈ కార్యక్రమన్ని వినూత్న శైలిలో స్ఫూర్తివంతంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు.
ఈ సందర్బంగా విద్యార్ధులు గణితంలోని పలు క్లిష్టమైన అంశాలపై సులభంగా అర్థమయ్యేలా స్వయంగా తయారుచేసిన గణిత నమూనాల సహాయంతో వివరించి ఆకట్టుకున్నారు. అదేవిధంగా గణితంలోని పలు విషయాలకు సంబంధించిన వర్కింగ్ మోడల్స్ ప్రదర్శిస్తూ వాటి ఉపయోగాల పై చేసిన వివరణలు ఆలోచనత్మకంగా సాగాయి. గణిత దినోత్సవ సందర్భంగా గత మూడు రోజులుగా గురుకులంలో జూనియర్స్, సీనియర్స్ విభాగంలో వేరువేరుగా విద్యార్థులకు గణితంలో గమత్తులు, నిత్య జీవితంలో గణితం అనే అంశాలపై నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్య క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం విద్యార్థుల అందరి చేత ఉపాధ్యాయులు ప్రత్యేకంగా తయారు చేసిన గణిత ప్రతిజ్ఞను చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దాగం మహేష్, రేణిగుంట్ల సరిత, మ్యాథ్స్ డ్డిపార్టుమెంట్ అధ్యక్షులు వరమని ప్రమోద్ కుమార్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ దాసం అజిత, ఉపాద్యయులు నాగిని శ్రీరామ వర్మ, దుర్గం రమాదదేవి, కోట్ర గణపతి, కొక్కుల రాజేశ్వర్, షిండే దత్తప్రసాద్, చంద్ర శేఖర్, కాసర్ల రాజేందర్, రామిశెట్టి రామారావు, మిట్ట రమేష్, అనిరుధ్, ఆకినేపల్లి రాజెష్, గాజుల రాజేందర్, చందా లక్ష్మి నారాయణ, విజయ్, సమందర్, రాజశేఖర్ తదితరులు పాల్గోన్నారు.
గణితమేళను ఏర్పాటుచేయడం అభినందనీయం




