Sunday, 8 November 2026

ఘనంగా గణిత దినోత్సవం

ఘనంగా గణిత దినోత్సవం అలంపూర్ జనంసాక్షి (డిసెంబర్ 22)
అలంపుర్ పట్టణం లోని హరిజనవాడ జిల్లాపరిషత్ లో గురువారం ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినమైన డిశంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవం గా ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్బంగా రామాంజన్ చిత్ర పటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు మండల విద్యాధికారి శ్రీ ఆర్ అశోక్ కుమార్ పూలమాల వేసి నీవాళ్ళు అర్పించారు. ఈసందర్బంగా మండల విద్యాధికారి అశోక్ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజం చిన్నతనంలోనే ప్రపంచ గణిత మేధావిగా ఎదగడానికి అతడు చేసిన కృషిని కొనియాడారు. నిత్య జీవితంలో గణితం యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు. ఉదయం లేచింది మొదలు గణితంతో పెనవేసుకున్న అనుబంధాన్ని ఉదాహరణలతో చెప్పడంతో విద్యార్థులు ఆసక్తికరంగా విన్నారు. భవిష్యత్తులో గణితంలో నైపుణ్యాన్ని సాధించి ఉన్నతస్థితికి చేరుకోవాలన్నారు. అనంతరం గణిత ఉపాధ్యాయుడు శ్రీ కోళ్ల రాజశేఖర్ మాట్లాడుతూ గణిత శాస్త్ర ప్రాముఖ్యత, సంఖ్యల వివరాలు, సులభరీతిలో నిజ జీవిత వినియోగం మొదలైన అంశాలన్నీ భోధనోపాకరిని సాయంతో వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేగ గణితంలో మెలకువలు కూడా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఇన్ చార్జ్ ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు, ఉపాధ్యాయులు యన్ . శ్రీధర్ , భైరోజు రాజశేఖర్ , వ్యాయామం ఉపాధ్యాయు రాలు శైలజ, మరియమ్మ మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.