ప్రజా గాయకుడు గద్దర్ కు, ఎడిటర్ జహీరుద్దీన్ ఆలీఖాన్ కు నివాళులు అర్పించిన గడ్డం సదానందంసిపిఐ(యం-యల్)
హైదరాబాద్ ఆగస్టు 8 జనం సాక్షి
సిపిఐ(యం-యల్) రెవల్యూషనరీ ఇనిషియేటివ్ రాష్ట్ర కమిటీ సమావేశం ఉప్పల్ లోని పార్టీ ఆఫీస్ లో రాష్ట్రకమిటి సభ్యుడు కామ్రేడ్ జైపాల్ అద్యక్షతన 8-8-’23న జరిగింది. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజల కోసం ఆడి పాడి ఉద్యమాలకు అసమాన స్థాయి లో ఊతం గా నిలిచిన గద్దర్ కు, గద్దర్ అంతిమ యాత్ర లో నడుస్తూ అసువులు బాసిన ప్రజాస్వామికవాది, సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ ఆలీఖాన్ కు నివాళులు అర్పించి సమావేశం ప్రారంభమైంది.తారామతిపేట భూదాన్ భూముల ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కమిటీ నిర్ణయం చేసింది.మణిపూర్ లో క్రైస్తవ కుకీ తెగ జాతి హననం, యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేయాలనే బిజెపి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను, హర్యానా లో ముస్లిం పై RSS శిబిరం శక్తుల దాడులు ఖండిస్తూ తీర్మానం చేసింది. రేపు, ఎల్లుండి (9,10 ఆగస్టు) లలో హైదరాబాద్ లో జరుగబోయే కేంద్ర కమిటీ సమావేశం ల ఏర్పాటులను సమీక్షించింది. పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల ఏర్పాటుకు సహకరించవలసిందిగా హైదరాబాద్ లోని ప్రగతిశీల వాదులందరకు సిపిఐ (ఎంఎల్) ఆర్ ఐ తెలంగాణ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.