Thursday, 5 November 2026

గద్వాలకు మెడికల్ కళాశాల 2023 నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కి బహిరంగ లేఖ

గద్వాల నడిగడ్డ, జూన్ 10 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల లో మెడికల్ కళాశాల 2023 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజా సంఘాల, మెడికల్ కళాశాల సాధన సమితి నాయకులు శనివారము వినతి పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు.అన్ని పార్టీల, ప్రజా సంఘాల కుల సంఘాల విద్యార్థి యువజన మేధావి పౌర సమాజం తరపున జోగులాంబ గద్వాల జిల్లా మొత్తము తెలంగాణ జిల్లాల్లోని విద్యలో వెనుకబడిన విషయం అందరిని ఆందోళన కలిగిస్తున్న అంశం ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వివక్ష త క్షపూరిత విధానాల వల్ల సమాజాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి విద్యను అందించకుండా దురుద్దేశ పూర్వక విధానాలతోనే వెనకబడింది అనేది కాదనలేని నిప్పులాంటి నిజం అని వారన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం విద్యాభివృద్ధికి కొంత కృషి జరిగిన ఇంకా ఎంతో కావలసిన అవసరం ఉందనే విషయం గుర్తించక తప్పదు మెడికల్ కళాశాల కావాలని ఇక్కడి ప్రజలు అనేక సంవత్సరాలు కోరుతూనే పోరాడుతూనే ఉన్నారనీ, తెలంగాణ ప్రభుత్వం అనేక మెడికల్ కళాశాల మంజూరు చేసి ప్రారంభించినది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్, వనపర్తి ,నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల మంజూరు చేసి ప్రారంభించారనీ, ఆలంపూర్ అమర చింత, మక్తల్, గద్వాల ప్రాంతాలకు అందుబాటులో ఉన్న గద్వాలకు మెడికల్ కళాశాల అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినదనీ, అయినా మంజూరు చేస్తున్నట్టు ఇప్పటివరకు జీవో విడుదల కాలేదనీ, ఈ ఈనెల 12వ గద్వాల మీరు వస్తున్న సందర్భంగా గద్వాలకు మెడికల్ కళాశాల మంజూరు చేసి ఈ విద్యా సంవత్సరం నుంచి 2023 24 తరగతులు ప్రారంభింపజేస్తారని ఇక్కడి ప్రజలు కోరుతున్నారనీ వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల సాధన సమితి, అఖిలపక్ష కమిటీ జోగులాంబ గద్వాల జిల్లా నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, మధుసూదన్ బాబు, వెంకటస్వామి, ఆంజనేయులు, అతికుర్ రహ్మాన్, ఆలూరు ప్రకాష్ గౌడ్, ఎం. వాల్మీకి, .వినోద్ కుమార్, ఖాజా, గోపాల్ రావు, కోళ్ళ హుస్సేన్, రంగు మదిలేటి, లెక్చరర్ వేణు, వకీలు దామోదర్, డాక్టర్ ప్రేమ్ కుమార్, రహమతుల్లా, సాదత్ ,శివ, సాయి సవరన్, పరంజ్యోతి, జగన్నాథ్ వెంకటేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.