బచ్చన్నపేట జూన్ 10 (జనం సాక్షి) టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరియు గ్రామ ప్రజల సహకారంతో వి ఎస్ ఆర్ నగర్ అభివృద్ధి పథంలో నడుస్తుందని బచ్చన్నపేట మండలం వి ఎస్ ఆర్ నగర్ గ్రామ సర్పంచ్ కోనేటి స్వామి అన్నారు. శనివారం గ్రామపంచాయతీ సుపరిపాలన దినోత్సవం గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.
2018 ఆగస్టు ఏడో తారీకు ఏర్పడిన నూతన గ్రామపంచాయతీ 2023 నేటి వరకు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథకాలతో గ్రామం అభివృద్ధి చెంది జిల్లాలోని పేరుగాంచడం జరిగిందన్నారు సుమారు ఇప్పటివరకు 90 లక్షల రూపాయలతో వైకుంఠధామం రాక్ గార్డెన్ నర్సరీ సీసీ రోడ్స్ అండర్ డ్రైనేజ్ విద్యుత్ పోల్స్ మరియు వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు నూతన గ్రామపంచాయతీ ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామాభివృద్ధికి సహకరిస్తూ ప్రతి పనిలో పాలుపంచుకుంటున్న పాలకమండలి పంచాయతీ కార్యదర్శి మహిళా సంఘాలు యువజన సంఘం గ్రామస్తులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ దిలీప్ పంచాయతీ కార్యదర్శి రూబీ నా సుల్తానా ఉప సర్పంచ్ చవాన్ నరేష్ వార్డు సభ్యులు కళ్యాణం అనసూయ లేదు కృష్ణవేణి మోతే రాజు మానుపాటి రజిత రెడ్డెం రేణుక బండి సంజీవరెడ్డి అంగన్వాడీ టీచర్ హాజీరా బేగం యువజన సంఘం అధ్యక్షులు కళ్యాణం ధనుంజయ్ కుమార్ బొడ్డు యాదగిరి రెడ్డి కాసర్ల రవి వంగ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
సంక్షేమ పథకాలు ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి సర్పంచ్ కోనేటి స్వామి




