Tuesday, 3 November 2026

గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నూతన చైర్మన్ గా పచర్ల శ్రీధర్ గౌడ్

 

 

 

 

 

 

 

 

*ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ & పర్యాటక క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్*గద్వాల ఆర్ సి.( జనంసాక్షి)జనవరి 28,జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రములోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ చైర్మన్గా నియమింపబడ్డ పచర్ల శ్రీధర్ గౌడ్, డైరెక్టర్లను ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి & సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎక్సైజ్ శాఖ ,పర్యాటక క్రీడా శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , వారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…… నడిగడ్డ ప్రాంతంలో పేద సామాజిక వర్గాలను తొక్కిపెట్టిన చరిత్ర ఈ ప్రాంతానిదే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నడిగడ్డ ఎడారి ప్రాంతంగా ఉండేదని కెసిఆర్ వచ్చిన తర్వాత ప్రాంతం తీర్చిదిద్దడంతో పాటు నేడు బీసీ వర్గాలకు సీట్లు దక్కేలాచేసిన ఘనత కేసీఆర్ దే అని మీ ముందు స్పష్టం చేస్తున్నానని అన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు గౌరవం దక్కిందని అన్ని వర్గాలకు దళిత బంధు ముదిరాజ్ మృత్యు
కార్మికులకు, కళ్యాణ లక్ష్మి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బలోపేతం చేసిన చరిత్ర కెసిఆర్ ది అని వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా గద్వాల ఎమ్మెల్యే తో పాటు అలంపూర్ ఎమ్మెల్యే మంత్రులతో కెసిఆర్ కు చెప్పించి ఎస్టీ జాబితాలో వచ్చే విధంగా చూస్తామని తెలిపారు. శ్రీను రంజన్ రెడ్డి మాట్లాడుతూ….. నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ సభ్యులందరూ మీ పెదవులకు న్యాయం చేస్తూ ముందుకెళ్లాలని వారికి అభినందనలు తెలిపారు. రైతులపై ఆదాయ పన్ను లేదని అటువంటిది కేంద్ర ప్రభుత్వం రైతులపై ఆధారపడిన విధిస్తామని అంటున్నారని అన్నారు. కేవలం రైతులు అడుగుతున్నది రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఎరువుల సబ్సిడీ ఇవ్వాలని కరెంట్ బిల్లు కూడాదని ఉచిత కరెంటు వాళ్ళని రైతులు అడుగుతున్నారని అలాంటిది ఇవ్వకుండా రైతులపై వేధించడం తగదన్నట్లుగా చెప్పారు. కెసిఆర్ చెప్పిన నినాదం మేమoటే ఆప్ కీ బాత్ కిసాన్ కి సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…….. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు వ్యవసాయరాబడులు పెరిగాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగం ముందుకు వెళ్లడంతో నేడు మార్కెట్ చైర్మన్ హోదా పెరగడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం కృషి చేయాలని నూతన కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్ సూచిస్తూ కమిటీ సభ్యులు పారదర్శకంగా ఉండేలా చూడాలని అన్నారు.అలంపూర్ ఎమ్మెల్యే ….అబ్రహం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం, చైనా అమెరికా దేశల్లో విస్తీర్ణం తక్కువ నన్నే భూములు అక్కడ లేవని వాటిని దృష్టిలో పెట్టుకొని పరంగా తీసుకువెళ్లాలని చెప్పారు. జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య….. మాట్లాడుతూ రైతుల సమస్యలను నిష్పాతంగా ఎప్పటికప్పుడు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ సరిత గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, రాష్ట్ర కన్స్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప మున్సిపల్ చైర్మన్ జడ్పీటీసీలు ఎంపీటీసీలు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సర్పంచ్లు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు