హైదరాబాద్: తెలంగాణ శాసనసభ నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తెదేపా ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టారు. దీంతో తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… పైశాచిక ఆనందం కోసమే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. సస్పెన్షన్‌పై పునరాలోచించాలి, లేకపోతే పోరాటానికి సిద్ధమని పేర్కొన్నారు.
గన్‌పార్క్ వద్ద ఆందోళనకు దిగిన తెదేపా ఎమ్మెల్యేలు అరెస్ట్




