Thursday, 5 November 2026

తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయండి

1qvkkshrసాధ్యమైనంత తొందరగా తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని టీయారెస్ ఎంపీ కే కేశవరావు డిమాండ్ చేశారు. రాజ్యసభ జీరో అవర్ లో హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తిన ఆయన.. ఉమ్మడి హైకోర్టువల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. హైకోర్టులో మొత్తం 29 మంది జడ్జీలుంటే అందులో తెలంగాణ వాళ్లు కేవలం ఆరుగురే ఉన్నారన్నారు. మొత్తం 472 మంది జిల్లా జడ్జీల్లో తెలంగాణ జడ్జీలు 150 మందేనని చెప్పారు. అన్యాయం జరగుతున్నందుకే తాము ప్రత్యేక హైకోర్టు కోరుతున్నామన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *