హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, నేతి విద్యాసాగర్ రావు తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.




