గన్ మెన్ మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనంసాక్షి, మంథని : మొన్న కాకతీయ కాలువలో పడి హెడ్ కానిస్టేబుల్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గన్మెన్ దుండే మల్లయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం కరీంనగర్ లో ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పరామర్శించారు. మల్లయ్య గతంలో మంత్రిగా ఉన్న సమయంలో గన్ మెన్ గా, ఇప్పుడు ఎమ్మెల్యే సమయంలో కూడా గన్మెన్ గా చేస్తున్న మల్లయ్య మరణించడంపై మంథని నియోజక వర్గం శాసనసభ్యులు శ్రీధర్ బాబు తీవ్ర విషాదానికి లోనయ్యారు. మల్లయ్య చేసిన సేవలు చాలా గొప్పవని, వారు చనిపోవడం మాకు తీరని లోటు అని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.