Saturday, 7 November 2026

గర్భిణీలకు కి సి ఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ

గర్భిణీలకు కి సి ఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ
అశ్వారావుపేట, డిసెంబర్ 21(జనంసాక్షి )
గర్భిణీలకు తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు బుధవారం నాడు ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అశ్వరావుపేట మండలంలోని వినాయకపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీ స్త్రీలలో వచ్చే రక్తహీనతను అరికట్టడానికి, గర్భిణి స్త్రీలలో పోషకాహార స్థాయిని మెరుగుపరచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలకు ఎంతో మేలు కలుగుతుందని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు తెలిపారు.గర్భిణీలు కెసిఆర్ కిట్ లో ఉన్న ఐరన్ మరియు పోలిక్ యాసిడ్ సిరప్ రక్తహీనతలోపాలు ఉండవని, ఆహార పదార్థాలను సరిగ్గా తీసుకున్నట్లయితే పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే అన్నారు. తల్లి బిడ్డల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు మరువలేనివి అని ఎమ్మెల్యే మెచ్చ కొనియాడారు. గర్భిణీలు అందరూ ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఏఎన్ఎం లకు యూనిఫామ్ లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం స్త్రీ శిశు సంక్షేమ.శాఖ ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చల్ల ప్రసాద్, వైద్యాధికారి భూక్య రాందాస్, సిడిపిఓ రోజా రాణి, జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, భారత రాష్ట్ర సమితి అశ్వరావు పేట మండల కన్వీనర్ బండి పుల్లారావు, ప్రధాన కార్యదర్శి జుజ్జూరు వెంకన్న బాబు, రాజమోహన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు, కల్పాల శ్రీనివాసరావు, సర్పంచ్ పోడియం సత్యవతి, ఎంపీటీసీ లలిత, చిన్నంశెట్టి వెంకట నరసింహ, నార్లపాటి రాములు, గంధం వెంకటేశ్వరరావు, సంపూర్ణ, తాడేపల్లి రవి, నల్లపు లేదా ప్రసాద్, వైద్య సిబ్బంది గర్భిణీలు, అంగన్వాడీ టీచర్లు,సూపర్వైజర్ విజయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.