Saturday, 7 November 2026

మందమర్రి సిపిఐ ధర్నా…బుధవారం మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నానిర్వహించడం జరిగింది.

మందమర్రి సిపిఐ ధర్నా…బుధవారం మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నానిర్వహించడం జరిగింది.
*ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు మందమర్రి తహశీల్దార్ కార్యాలయల ముందు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర సమితి పిలుపులో బాగంగాతహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యులు మిట్ట పెల్లి శ్రీనివాస్ మందమర్రి పట్టణ కార్యదర్శ కమేర దుర్గ రాజు లు హాజరై మాట్లాడారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కేంద్రరాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని. స్తానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించడం జరిగింది అన్నారు కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పోరాడి సాధించుకున్న కార్మిక కర్షక హక్కులను కాలరాసే విధంగా పెట్టుబడి దారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్నారు కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అన్నారు విబజన హామీలు అమలు చేయాలని కోరారు.
అదేవిధంగా రాష్ట్రం లో తెరాసా ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు పెన్షన్లు రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మందమర్రి కి ఎన్నికలు నిర్వహించాలని తోల్ల పరిశ్రమ ప్రారంభించాలని క్యాతన పెల్లి మున్సిాలిటీల్లో శ్మశాన వాటిక డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అసరా పెన్షన్లు బ్యాంక్ ల ద్వారా చెల్లించాలని. ధరణీ పోర్టల్ లో ఉన్న లోసగులు తొలగించి బూసమస్యలు పరిష్కారం చేయాలనీ అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములను ప్రభుత్వ అదినం లోకి తీసుకోని నిరుపేదల ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఇండ్ల స్థలాలు ఉన్న వారికి ఇండ్లు నిర్మించు కోవడానికి 10 లక్షలు ఆర్ధిక సహాయం చేయాలని అన్నీ గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమం లో సీపీఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ నక్క వెంకటస్వామి మెరుగు రాజేశం. సీపీఐ నాయకులు బండారి రజేశం గడ్డం సంతోష, కుమార్ లక్ష్మి పిట్టల రవి s శ్రీను గజ్జెల గోపాల్ కొక్కులా సంజీవ్ జంగపెల్లి సత్యనారాయణ కారుకురి రాయలింగూ ముతుకుల రాజన్న మదాసు శంకర్ గుమసా మల్లేశ్ నాయకులు మారపెళ్ళి రవి మోతె రాయలింగు ఏఐటీయూసీ నాయకులు గోవిందుల రమేశ్ బోయాపోతుల కొమురయ్య నాయకులు ఈరవెని రవీందర్ మమిడాల సత్యం అవుల దుర్గా ప్రసాద్ యటకరి శివ రమంచ వరుణ్ తదితరులు పాల్గొన్నారు…..జనం సాక్షి