గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించే దిశగా కేసీఆర్ పాలన.చిన్నతూండ్లలో సంక్షేమ, అభివృద్ధి పనుల కోసం సుమారు 9.92 కోట్లు ఖర్చు.ఎమ్మేల్యేతో మాట్లాడి అభివృద్ధి పనులు చేయిస్తానని హమీ. వెటర్నరీ డాక్టర్ వారంలో 3రోజులు ఉండేలా చర్యలు.కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిరంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, జనవరి30(జనంసాక్షి):-ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 9వ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి యాచారంమండలం చిన్నతూండ్ల గ్రామంలో సోమవారం మహత్మ గాంధీజీ వర్థంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రతి కాలనికి వెళ్లి, గడప గడపకు తిరుగుతూ చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులను వివరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం చిన్నతూండ్ల గ్రామ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మహత్మగాంధీ వర్థంతి సంధర్బంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ… గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సాధించే దిశగా సీఎం కేసీఆర్ పరిపాలన సాగుతుందని అన్నారు.గ్రామంలోని నేను ఓట్ల కోసం పాదయాత్ర చేస్తున్నానని మీరు అనుకోవచ్చు కానీ, నేను ఓట్ల కోసం రాలేదు, ఇప్పుడు ఎన్నికలు లేవు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, ఎమ్మేల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించటానికి.. అదేవిధంగా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవటానికే వచ్చానని వివరించారు.
గత 8సంవత్సరాల నుంచి చిన్నతూండ్ల గ్రామంలో బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ త్రాగునీటి పైపులైన్, మరియు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మత్తు, పూడికతీత.. ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం సుమారు 6.33కోట్ల రూపాయలను, అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాల కోసం ఈక్రింది విధంగా లబ్దిదారులకు చేస్తున్న ఖర్చును వివరించారు.ప్రతినెలా సుమారు 246 మందికి వివిధ రకాల పెన్షన్ల కోసం దాదాపు 5.46లక్షలు రైతుబంధు పథకం ద్వారా సుమారు 622 మంది రైతులకు దాదాపు 97.02లక్షలు రైతుభీమా పథకంతో సుమారు 13మంది రైతులకు దాదాపు 65 లక్షలు సీఎంఆర్ఎప్ పథకం నుంచి సుమారు 21మందికి దాదాపుగా 8.70లక్షలు 5. కళ్యాణలక్ష్మీ లేదా షాదీముబారక్ పథకంతో సుమారు 81 మందికి దాదాపు 60లక్షలు కేసీఆర్ కిట్లు సుమారు 147 మందికి పంపీణీ దాదాపు 22.78లక్షలు.ఇప్పటివరకు చాలా ప్రభుత్వాలు మారాయి, చాలా మంది ముఖ్యమంత్రులు మారారు కానీ, పేదల బ్రతుకులు మాత్రం మారలేదు. ఒకసారి ఆలోచించండి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయి. 10సంవత్సరాల క్రితం చిన్నతూండ్ల గ్రామం ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది గమనించాలి. పేదల ప్రజల గురించి ఆలోచించి న్యాయం చేస్తున్నది సీఎం కేసీఆర్ . పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు భారంగా ఉండేది కానీ, సీఎం కేసీఆర్ మేనమామ కన్నా ఎక్కువగా ఆడబిడ్డ పెళ్లి కోసం 1లక్ష నూటపదహరు రూపాయలు ఇస్తున్నారని అది మీగ్రామంలో 81 మందికి కళ్యాణలక్ష్మీ పథకం క్రింద 60లక్షల రూపాయల చెక్ లు ఇచ్చామని అన్నారు.సీఎం కేసీఆర్ రైతుల గురించి ఆలోచించి రైతుబంధు పథకాన్ని తెచ్చారు. గతంలో రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థుల వద్దకు వెళ్లి అధిక వడ్డీతో అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేసుకునేవారు. నేడు ఆపరిస్థితి లేకుండా కేసీఆర్ పెట్టుబడి కోసం రైతులకు సంవత్సరానికి 1ఎకరానికి 10వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేస్తున్నారని మీగ్రామంలోనే సుమారు 622 మంది రైతులు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం పొందుతున్నారని అన్నారు.గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం అదేవిధంగా నూతన ముదిరాజు సంఘ భవనం, యాదవ సంఘ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణం చేయాలని సంఘాల నాయకులు కోరగా.. తక్షణమే ఎమ్మేల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గారితో మాట్లాడి నిర్మాణాలను పూర్తి చేయిస్తానని అన్నారు.గ్రామంలో వెటర్నరీ ఆస్పత్రిలో డాక్టర్ వారానికి 3 రోజలు అందుబాటులో ఉండేవిధంగా ఎమ్మేల్యే కిషన్రెడ్డి తో మాట్లాడి వెటర్నరీ డాక్టర్ను ఏర్పాటు చేస్తానని అన్నారు.పాఠశాలలో విద్యార్థులకు భోజనం చేయటానికి సుమారు 100స్టీల్ ప్లేట్లను ఎంకేఆర్ పౌండేషన్ ద్వారా అందజేస్తామని, క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విద్యార్థులకు వాలీబాల్ కిటు, అదేవిధంగా యువకులకు క్రికెట్ కిట్లు అందజేశారు.
గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేంద్రాన్ని సందర్శించి ఆప్రక్రియను పరిశీలించి డాక్టర్లతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకొని కళ్లద్దాలు తీసుకోవాలని కోరారు.ప్రగతి నివేదన యాత్రలో జెడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, సర్పంచ్ సబిత ఆంజనేయులు, మాజీ సర్పంచ్ సత్యపాల్, గ్రామశాఖ అధ్యక్షుడు అంకని రమేష్, ప్రధాన కార్యదర్శి శంకర్ , పీఎసీఎస్ డైరెక్టర్లు స్వరూప,శశికళ, కొత్తపల్లి ఎంపీటీసీ సుమతమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తల్లారి మల్లేష్, శంకర్ నాయక్ ,రాజశేఖర్ రెడ్డి, ఆనంద్, మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి నాయకులు రాజునాయక్, ఓరుగంటి యాదయ్యగౌడ్ మరియు బీవైఎఫ్ సభ్యులు పాల్గోన్నారు.




