నెరడిగొండ జనవరి30(జనంసాక్షి):
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 134 రోజులో 4084 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ ఏఐసిసి పిసిసి డీసీసీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ చేపట్టిన
చారిత్రక మహాఘట్టం కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ముగింపు సంఘీభావంగా సోమవారం రోజున మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఆడే వసంత్ బ్లాక్ అధ్యక్షులు ప్రఫుల్ రెడ్డి నాయకులు రాజశేఖర్ రెడ్డి జాదవ్ వసంత్ రామ్ లక్ష్మణ్ గౌడ్ రాజు గౌడ్ తదితరులు పాల్గొని జాతీయ జెండాను ఎగరేసి సంఘీభావం తెలిపారు.అలాగే మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.




