Thursday, 5 November 2026

గాంధీభవన్‌లో తెలంగాణ వేడుకలు

సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్న  డీఎస్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
:  టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేసామా అని తెలంగాణ ప్రజలు పశ్చాత్తాపడుతున్నారని టి.కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. బూటకపు మాటలతో ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొంది సంవత్సరం పూర్తయిన సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు సంబరాలు జరుపుకున్నారు.  పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ నేతలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌నేత డి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావనకు ముఖ్య కారకురాలు సోనియాగాంధీ అని తెలిపారు. ఆమె తలచుకోకుంటే ఇవాల తెలంగాణ వచ్చేది కాదన్నారు. అయితే ఈ విసయాన్ని మరనచి టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నో దశాబ్దాల పోరాటం తర్వాత రాష్ట్ర ఏర్పాటు కల  సాకారం అయ్యిందన్నారు. పార్టీలో సానుకూలత వచ్చేలా అందరినీ ఒక తాటిపైకి తెచ్చిన ఘనత సోనియాదేనన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీనేత జానారెడ్డి, సీనియర్‌ నేతలు వీహెచ్‌, షబ్బీర్‌ అలీ, పొన్నం ప్రభాకర్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానా మాట్లాడుతూ  వ్యతిరేకుల నోరు మూయించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ను ధైర్యాంగా ఇచ్చారని అన్నారు. సోనియా వల్లే రాష్ట్రం వచ్చిందన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. అయితే తెలంగాణ ఇచ్చిన సమయం సరైంది కాకపోవడం వల్లే పార్టీకి నష్టం జరిగిందన్నారు. ఇచ్చిన హావిూల అమలులో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే సోనియాకు నిజమైన కృతజ్ఞత అని అన్నారు. నేతలు విభేదాలు పక్కనపెట్టి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరం కలిసి కృషి చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే కేసీఆర్‌ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మాటలు మార్చే వ్యక్తి కేసీఆర్‌ అని, ఎన్నికలయ్యాక ఆయన మళ్లీ తిట్ల దండకం అందుకుంటారన్నారు. విూడియాకు కూడా సంకెళ్లు వేస్తూ కేసీఆర్‌ నియంతాల వ్యవహరిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి కోట్లు దండుకున్న కేసీఆర్‌…ఇప్పుడు సెటిలర్స్‌ బాట పట్టారని ఆయన విమర్శించారు. మాట మార్చే నేత, మూఢ నమ్మకాల సీఎం అని ప్రజలే నిరసన తెలుపుతున్నారని పొన్నాల మండిపడ్డారు. నేతలకు వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా… కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలు అందరూ కలిసి చేసుకుందామని ఆయన ఈ సందర్భంగా సొంతపార్టీ నేతలకు సూచించారు. మాజీ మంత్రి దానం నాగేందర్‌ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే కేసీఆర్‌ సెటిలర్స్‌ వద్దకు వెళుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను సీమాంధ్రులు నమ్మవద్దని దానం నాగేందర్‌ విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ కేబినెట్లో సగంమంది తెలంగాణ వ్యతిరేకులేనని  దానం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ క్యాడర్ను వేధిస్తే పోలీస్‌ స్టేషన్లను కూడా ముట్టడిస్తామని దానం హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు టీఆర్‌ఎస్‌ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *