చిలకలగూడ: స్వైన్ఫ్లూ మహమ్మారి పంజా విసురుతోంది. తాజాగా సోమవారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గున్నమ్మ(34) అనే మహిళ మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలం గుట్టిగ గ్రామానికి చెందిన గున్నమ్మ వారం రోజులుగా గాంధీలో చికిత్స పొందుతోంది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటికే స్వేన్‌ఫ్లూతో 11 మంది మృతి చెందగా ప్రస్తుతం ఆస్పత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు.




