సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూ చికిత్స పొందుతున్న ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో వారు చేరినప్పటినుంచి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయినా కూడా వారి పరిస్థితి విషమంగా ఉంటుందని, మెరుగైన చికిత్స అందిస్తూ వ్యాధిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. స్వైన్ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తున్నారు.




