Monday, 2 November 2026

హైదరాబాద్ కోఠి ఉమెన్స్‌ కాలేజీ వద్ద కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్: నగరంలోని కోఠి ఉమెన్స్‌ కాలేజీ వద్ద కిడ్నాప్‌ కలకలం రేగింది. రాత్రి హాస్టల్‌కు వెళ్తున్న విద్యార్థినులను ఇద్దరు పోకిరీలు వేధించారు. ఓ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితురాలు కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన మిగతా విద్యార్థినులు ఇద్దరి నిందితుల్లో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పరారైన మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *