‘గాలి’ కేసు నవంబర్ 28కి వాయిదా
బళ్లారి: గనుల సరిహద్దుల చెరిపివేత, తపాలా గణేష్‌పై దాడి కేసులను సండూరు కోర్టు నవంబర్ 28 వాయిదా వేసింది. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు ఈ రోజు సండూరు కోర్టులో హాజరుపరిచారు. విచారణ నిమిత్తం ఈ కేసును నవంబర్ 28కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.దీంతో గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు బెంగళూరు జైలుకు తరలించారు. ఈకేసు విచారణ సమయంలో సండూరు కోర్టుకు వచ్చిన ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్యేను పోలీసులు కోర్టులోనికి అనుమతించలేదు.