Tuesday, 3 November 2026

గిమ్మ గ్రామం లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

 

 

 

 

 

 

 

జైనథ్ జనం సాక్షి జనవరి 27 మండలంలోని గిమ్మ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్న తరుణంలో శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ అకస్మాత్తుగా కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించారు ఏ విధంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎందరు కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు తదితర విషయాలపై అక్కడ ఉన్నటువంటి గిమ్మ గ్రామ ప్రజలకు అడిగి తెలుసుకున్నారు గిమ్మ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇప్పటివరకు 632 మంది కంటి పరీక్షలు నిర్వహించగా 120 మంది కి అద్దాలు వస్తాయని డాక్టర్లు గుర్తించారు అందులో 80 మందికి అద్దాలు పంపిణీ చేశారు కంటి వెలుగు ద్వారా ప్రజలకు కంటి సమస్య లో లోపం గుర్తించి వాటిని తగిన చికిత్సను కంటి వెలుగు ద్వారా అందిస్తున్నారు దానితో ప్రజలకు పట్టణాలలో కంటి పరీక్ష చేయించుకునే అవసరం పోయింది దానితో కెసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు జిల్లా కలెక్టర్ తో పాటు జైనథ్ మండల ఎంపీపీ మాల్సెట్టి గోవర్ధన్ వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ జడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి గిమ్మ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.