Tuesday, 3 November 2026

గిరిజన తండాల రోడ్లకు నిధులు

గిరిజన తండాల రోడ్లకు నిధులు

-ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
భైంసా రూరల్ నవంబర్ 30 జనం సాక్షి

 

ముధోల్ నియోజకవర్గం లోని గిరిజన తండాల బీటీ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూపాయలు 8 కోట్ల 94 లక్షలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి తెలిపారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని తొమ్మిది రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ జీవో నెంబర్ 178 ద్వారా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. ఇందులో కుబీర్ మండలంలోని రంజని- జాంగావ్ రోడ్డుకు రూపాయలు 2 కోట్లు, పి ఆర్ రోడ్డు నుంచి dodarna వయా రాజీవ్ నగర్ తండా రోడ్డుకు రూపాయలు కోటి 16 లక్షలు, పార్టీ కె నుంచి పార్డి కే తండా రోడ్డుకు రూపాయలు 58 లక్షలు, తా నూర్ మండలంలోని కుప్టి నుంచి కళ్యాణ్ తండా రోడ్డుకు రూపాయలు 60 లక్షలు, జహరితబద్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు నుంచి కళ్యాణ్ తండా రూపాయలు 55 లక్షలు, కుంటాల మండలంలోని అంబకంటి తాండ నుంచి అంబకంటి రోడ్డు నకు రూపాయలు ఒక కోటి 16 లక్షలు, ఓలా నుంచి రాజాపూర్ రోడ్డుకు రూపాయలు ఒక కోటి 16 లక్షలు, భామ్ని బి నుంచి బామ్ని తాండ రోడ్డుకు రూపాయలు 58 లక్షలు, నర్సాపూర్ మండలంలోని అర్లీ చెక్క రోడ్డు నుంచి అంబకంటి తండా రోడ్డునకు రూపాయలు ఒక కోటి 15 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులు మంజూరు చేసినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారికి ,జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలిపారు.