గుండెగా0 చేరుకున్న బండి సంజయ్…
– గ్రామస్తులతో సమావేశమై, మాట్లాడి సమస్యలు తెలుసుకున్న బండి.
– అందరు చుట్టం చూపుగా చూసిపోయిన వారని..!తమ సమస్యలు తెలిపిన ప్రజలు.
– ఎమ్మెల్యే,మంత్రి శ్రద్ద పెట్టుంటే ఎప్పుడే సమస్య తీరేదని తెలిపిన గ్రామస్తులు.
– మీరు వస్తున్నారని ముంపు గ్రామసర్వేలు ప్రారంభం చేశారని తెలిపిన ప్రజలు.
భైంసా రూరల్ నవంబర్ 30 జనం సాక్షి
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లోని బై0సా మండలం గుండెగాం గ్రామంలోకి బండి సంజయ్ పాదయాత్ర ఎంట్రీ అవ్వగా,
వెల్కమ్ టు గుండెగాం అంటూ పూలతో నేలపై రాసి, బండి సంజయ్ పై పూలవర్షం కురిపిస్తూ గ్రామస్తులు,బిజెపి శ్రేణులు గ్రామంలోకి ఆహ్వానించారు. ఆడపడుచులు హారతులు పట్టి, అభిమానులు బాణసంచా కాలుస్తూ తమ అభిమానానికి వెళ్లబుచ్చారు. అనంతరం గుండెగా0 గ్రామ ప్రజలు తమ సమస్యలను బండికి విన్నవించారు.పళ్సీకర్ రంగారావు బ్యాక్లాగ్ వాటర్ తో గత 8 సంవత్సరాల నుంచి వర్షాకాలం వరదల కారణంగా, పాములు,తేళ్లు వంటి సరిసృపలుతో తాము నిద్రలేని రాత్రిలు గడిపినట్లు తెలిపారు. రోడ్లపై నిద్రించిన ఘటనలు ఉన్నాయని అన్నారు.తాలూకా ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఈ సమస్యలపై పట్టించుకోవడం లేదంటూ తెలిపారు. అందరూ చుట్టం చూపుగా వచ్చి చూసి పోయిన వారే కాని ఎవ్వరు కూడా పరిష్కార దిశగా మార్గాలు తొందరగా కాన్నివ్వడం లేదని తెలిపారు. ప్రశ్నిస్తే జైల్లోకి తరలిస్తున్నారని తెలిపారు. జైలు పాలైన సమయంలో మోహన్ రావు పటేల్,రమాదేవి ఆదుకున్నారని తెలిపారు. బండి సంజయ్ వస్తున్నారని చెప్పిసి ఆగమేఘాల మీద అధికారులు మొన్నటి నుండి సర్వే చేస్తున్నారన్నారు. సమస్యలు విన్న బండి సంజయ్ స్పందిస్తూ… వర్షం వస్తే చాలు గుండెగాం ప్రజల గు0డే గుబులవుతుందని తెలుసుకున్నని అన్నారు.కె.సి.అర్ తెరాస మంత్రుల ఎమ్మెల్యేల స్థలాలు ఇక్కడ ఉంటే పనులు ఎప్పుడో ప్రారంభించే వారిని, కాకుంటే ఇక్కడ ఉన్నది పేద ప్రజలు పేద ప్రజలు అంటే ప్రభుత్వానికి పట్టింపు లేదు అందుకే ప్రభుత్వం నీరక్ష్యం చేస్తుందని అన్నారు. వీరు నష్టపోయిన విధానం చూస్తుంటే ఈ గ్రామంలో చదువుకున్న విద్యార్థులకు సైతం ప్రభుత్వ0 ఉద్యోగాలుఇయాలన్నారు. పాదయాత్రకు వస్తున్నానని చెప్పి ప్రభుత్వానికి భయమేసి,అధికారుల చర్యలను వేగవంతం చేసిందని పేర్కొన్నారు. కెసిఆర్ దత్తత తీసుకున్న గ్రామాలకి అందనంత ఎత్తున అభివృద్ధి చేస్తూ, గుండెగాం లాంటి గ్రామాలనుమూలకుపడేస్తున్నారని అన్నారు.కెసిఆర్ ఏ గ్రామానికి వచ్చి ఇక్కడి పరిస్థితులను చూస్తే సమస్యలు అర్థమవుతాయన్నారు. కెసిఆర్ గ్రామానికి రాకుంటే స్వయాన నాతోని మనమందరం కలిసి కెసిఆర్ దగ్గరికి వెళ్దాం అన్నారు.
రానున్న రోజుల్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని,శాశ్వత పరిష్కారం దిశగా మీకు మేము తోడుంటామని భరోసా ఇచ్చారు.మీ సమస్యలన్నీ తీరుతాయని అన్నారు




