గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులపై ఇంత వివక్ష ఎందుకు
* బి.ఎడ్ చదువుటకు ఎన్ఓసి ఇచ్చుటకు ఐటీడీఏ అధికారుల నిరాకరణ
* టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి, డిసెంబర్ 23( జనం సాక్షి ): గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ భద్రాచలం ఉన్నతాధికారులు ఆ శాఖలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయులు ఉన్నతాభ్యాసం చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం వారికి కల్పించబడిన హక్కులను కాలరాస్తూ,బి.ఎడ్, బి.పిఎడ్ ఇన్సర్వీస్ లో చదువుటకు వారు దరఖాస్తు చేసుకొని నాలుగు నెలలు కావస్తున్న నేటికీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వారి ఉన్నతాభ్యాసానికి అడ్డుపడుతూ వారిపై వివక్ష చూపుతున్నారని ఇది సరైనది కాదని టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్ నాయక్ అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ఉపాధ్యాయుల చట్టపరమైన హక్కును కాలరాసే హక్కు ఏ ఉన్నతాధికారికి లేదని,వారికి వెంటనే ఎన్వోసీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఉపాధ్యాయులకు పదోన్నతులకు అవసరమైన విద్యార్హతను పొందుటకు ఇన్ సర్వీస్ లో ఉన్నతాభ్యాసం చేసుకొనుటకు సాంఘిక సంక్షేమ శాఖ జీ.వో 342 ద్వారా అవకాశం కల్పించింది అని అన్నారు. ఈ జీవో 342 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యాజమాన్యాలలోని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వారు ఏ కళాశాలలో అయితే చేరారో,ఆ కళాశాలలో విద్యాభ్యాసం చేసుకొనుటకు ఎన్ఓసీలు వెనువెంటనే ఇస్తున్నారు. కానీ ఐటీడీఏ భద్రాచలంలోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఐటిడిఏ అధికారులు అసంబద్ధమైన కారణాలు చెబుతూ, రాష్ట్రంలోని టాప్ 10 కాలేజీలలో చేరితే మాత్రమే ఎన్వోసీలు ఇస్తామని చెప్పి గిరిజన ఉపాధ్యాయులను ఉన్నతాభ్యాసానికి దూరం చేస్తూ,వారి హక్కులను కాలరాస్తూ,వారిపై వివక్ష చూపడం




