దేవరుప్పుల మే 31(జనం సాక్షి):దేవరుప్పుల మండలం, ధర్మాపురం గ్రామానికి చెందిన గీతా కార్మికుడు చిత్తలూరి భాస్కర్ గౌడ్ ఇటీవల తాటి చెట్టు పైనుండి జారిపడి చికిత్స పొందుతుండగా బుధవారం వారి ఇంటికి వెళ్ళి భాస్కర్ ను పరామర్శించి, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట గ్రామ సర్పంచ్ బజ్జూరి అశోక్, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన దేవరాజు, జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తీగల దయాకర్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బస్వ మల్లేశం, ప్రధాన కార్యదర్శి చింత రవి, ఏఎంసి వైస్ చైర్మన్ అనంతోజు కృష్ణమూర్తి పిఎసిఎస్ డైరెక్టర్ ఇరుకుల సతీష్, మాజీ ఎంపీపీ కొల్లూరి సోమన్న, వార్డ్ మెంబర్లు తాళ్లపల్లి నవీన్, వంగాల యాకయ్య, నాయకులు వంగాల చిరంజీవి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గీతా కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటానని హామీ – ఎర్రబెల్లి




