Monday, 2 November 2026

పదోన్నతి పై బదిలీ అయిన సత్యవతికి సన్మానం

టేకులపల్లి, మే 31( జనం సాక్షి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో పబ్లిక్ హెల్త్ నర్సుగా పనిచేస్తున్న ముత్తవరపు సత్యవతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పదోన్నతి మీద మొరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తున్న సందర్భంగా స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం ఘనంగా సన్మానించి శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రజలకు, తోటి సిబ్బందికి అందుబాటులో ఉండి వారితో సత్సంబంధాలు కలిగి నిత్యం సేవలు అందించే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సత్యవతి అందించిన సేవలను విశేషంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు,వీసం శకుంతల, గుజ్జ విజయ, ఏఎన్ఎం లు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.