-30 లక్షల ఆర్థిక సహాయంతో ఆదుకోవాలి.
-టిడిపి మాజీ జిల్లా అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి 14(జనంసాక్షి):
ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు చాలా ఎక్కువగా అయ్యాయని కావున ప్రభుత్వ వైద్యాధికారులు గుండెపోటుకు సంబంధించిన కారణాలు,నివారణ అంశాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జిల్లా అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల మాట్లాడుతూ గుండెపోటుతో చాలామంది మరణించడం జరిగిందని,ఒకప్పుడు వయసు పైబడిన వారికి గుండెపోటు వచ్చేదని ఈ మధ్యకాలంలో వయసుకు సంబంధం లేకుండా గుండెపోటు రావడం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మధ్యకాలంలో తెలంగాణలో పది రోజుల్లో ఏడు మంది యువకులు గుండె పోటు తో ఉన్నచోటే కుప్పకూలారని అన్నారు.ఒక్క రోజునే ఐదుగురు మరణించారని,అందరూ 30 ఏళ్లలోపు వాళ్లేనని పైగా వాళ్ల బాడీ చాలా ఫిట్నెస్ గా ఉన్నవాళ్లేనని ఒకరు నడుస్తూ ఒకరు జిమ్ము ఎక్సైజ్ చేస్తూ మరొకరు డ్యాన్స్ చేస్తూ మరొకరం ఇలా తెలంగాణలో 10 రోజుల్లోనే చాలామంది గుండెపోటుతో చనిపోవడం జరిగిందని అన్నారు.కావున వైద్య సిబ్బంది గుండెపోటుపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు.అలాగే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి వైద్యం అందక కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుండెపోటును ప్రమాదంగా పరిగణించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి 30 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అకస్మాత్తుగా కుటుంబ యజమాని పోషించే యువకులు చనిపోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. కావున ప్రభుత్వం అలాంటి కుటుంబాలను ఆదుకోవాలని వారి ఇంట్లో చదువుకున్న యువతీ యువకులు ఉంటే వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సహాయక కార్యదర్శి జిల్లా మాజీ ఆర్గనైజేషన్ సెక్రటరీ జాఫర్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రాము జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.




