గుజరాత్‌ ఉప ఎన్నికల్లో భాజపా విజయం

ఢల్లీి : గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లూ కైవసం చేసుకుని విజయకేతనం ఎగరేసింది. రెండు లోక్‌సభ, 4 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఆరు స్థానాల్లోనూ భాజపా అభ్యర్థులే గెలుపొందడం విశేషం. ఇవన్నీ గతంలో కాంగ్రెస్‌ స్థానాలు కావడంతో విజయం సాధించి తీరతామని ఆ పార్టీ భావిస్తూ వచ్చింది.