గుజరాత్ లో హైఅలర్ట్
అహ్మదాబాద్: గుజరాత్ లో ఈనెల 15 వరకు హైఅలర్ట్ ప్రకటించారు. తీవ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని పోలిసు ఉన్నతాదికారి ఒకరు తెలిపారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశామని, ముందుజాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.