Wednesday, 4 November 2026

కానిస్టేబుల్‌ కుటుంబాల ధర్నా

యూసఫ్‌గూడ: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ చెక్‌ పోస్టు వద్ద ఏపీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కానిస్టేబుళ్ల కుబుంబ సభ్యులు చెక్‌ పోస్టు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఆధికారులు కానిస్టేబుళ్లను హీనంగా చూస్తున్నారని, ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. హోంమంత్రి స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవలంభిస్తున్న పోలీస్‌ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని కోరారు. ఏసీఎస్పీ బెటాలియన్‌ ఐజీ వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *