హైదరాబాద్
హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసులు ఏపీ కార్గో ట్రాన్స్ పోర్టుపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా 22 గుట్కా సంచులను పట్టుకున్నారు. ఇతర రాష్ర్టాలకు గుట్కాను తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించి గుట్కా సంచులను పట్టుకున్నారు. వాటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, ఓ లారీ, డీసీఎం వ్యాన్లను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు.




