కుష్బూ గుప్తా కొండమల్లేపల్లి జనవరి 30 (జనంసాక్షి) న్యూస్: కొండమల్లేపల్లి మండల కేంద్రం గుడి తండా గ్రామంలో సోమవారం నాడు నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ కుష్బూ గుప్తా సందర్శించి తనిఖీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు మనబడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను నూతనంగా నిర్మిస్తోందని తెలిపారు మన ఊరు మనబడి లో భాగంగా గుడి తండాలో నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేసి పాఠశాల గదులు, పరిసరాలు పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలల్లోనే సుశిక్తులైన ఆధ్యాపకులు ఉంటారన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించి అప్పుల పాలు కావద్దని తెలిపారు ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి మండల అభివృద్ధి అధికారి బాలరాజు రెడ్డి, మండల విద్యాధికారి మాతృ నాయక్, డిఈ, ఏఈ సుమన్ నాయక్, సర్పంచ్ నేనావత్ అంజలి రాంబాబు, గుడి తండా ప్రాథమిక పాఠశాల ప్రదానోపాధ్యాయుడు వసికర్ల రమేష్, ఎస్ఎంసి చైర్మన్ నేనావత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు




