Tuesday, 3 November 2026

కుష్టు వ్యాధి పై అవగాహన సదస్సులుకుష్టు వ్యాధి పై అవగాహన సదస్సులు

 

 

 

 

టేకులపల్లి, జనవరి 30 (జనం సాక్షి):మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా  15 రోజుల వరకు గ్రామాలలో కుష్టి వ్యాధి పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశానుసారం సోమవారం నుండి నుండి అనగా జనవరి 30 నుండి ఫిబ్రవరి 13వ తారీకు వరకు అనగా 15 రోజులు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సులు సమావేశాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో భాగంగా  రాంపురం గ్రామపంచాయతీలో ప్రజలకు మండల వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ అధ్యక్షతన కుష్టు వ్యాధిపై అవగాహన సమావేశం  నిర్వహించారు. ఈ వ్యాధిపై ప్రజలు ఎటువంటి అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దని ఇది పూర్తిగా మందులకు నయమయ్యే వ్యాధి అని దీనికి ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లభిస్తాయని,ప్రభుత్వ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వ్యాధి పూర్తిగా నయం అయ్యేంతవరకు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. శరీరంలో అనుమానాస్పద మైన స్పర్శ లేని, రాగి రంగు మచ్చలు లాంటివి గుర్తించిన ఎడల వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి వ్యాధి నిర్ధారణ జరిగితే వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల ఎటువంటి అంగవైకల్యం లేకుండా  బయట పడొచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బానోత్ సరోజ, స్థానిక సర్పంచ్ భూక్య ఇందిరా, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు, దాసరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.