Wednesday, 4 November 2026

గుడిలో నగ్నంగా ఫోటోలు..అరెస్టు

ఫ్నోమ్ పెన్హ్: ఆలయంలో నగ్నంగా ఫోటోలు దిగినందుకు జైలు పాలయిన సంఘటన కాంబోడియాలో జరిగింది. లిండ్సీ(22), లిలీ(20)లు యూఎస్‌కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెల్లు. ప్రఖ్యాత అంగ్‌కోర్ వాట్ దేవాలయంలో నగ్నంగా ఫొటోలు దిగడంతో ఆలయాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వ ఏజెన్సీ అయిన అప్సర అథారిటీ వారిద్దరిని అదుపులోకి తీసుకుంది.

గత పక్షం రోజులుగా ఇలాంటి ఘటన జరగడం రెండోసారి. ఇంతకుముందు ముగ్గురు ఫ్రెంచి పర్యాటకులు బట్టలన్నీ విప్పివేసి ఫొటోలకు ఫోజిచ్చినందుకు నాలుగేళ్ళు కాంబోడియాకు వారు రాకుండా నిషేధం విధించారు. అప్సర అథారిటీ అధికార ప్రతినిధి చౌ సున్ కెర్యా దీనిపై స్పందిస్తూ బహుషా ఆ పర్యాటకులకు ఆంగ్‌కోర్ వాట్ ఆధ్యాత్మిక స్థలమని తెలియకపోవచ్చని పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *