Wednesday, 4 November 2026

గుడ్ బై నన్ను వెతక వద్దు.

 

 

 

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 7.8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అదృశ్యం అయిన సంఘటన నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ నరసింహ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.అంతయ్య కాలనీలో నివాసముంటున్న తులసి కుమార్(15) లాల్ బజార్ లోని సెంట్ జోసఫ్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు.నా బ్రతుకు నేను బ్రతుకుతాను నా గురించి వెతక వద్దు గుడ్ బై అని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.బంధువులు స్నేహితుల దగ్గర వెతికిన ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని సిఐ తెలిపారు.