Wednesday, 4 November 2026

ఆరోగ్యమే మహా భాగ్యం ఐఆర్సిఎస్ జిల్లా కోశాధికారి దస్థిరాం

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్ 07, (జనంసాక్షి),ఆరోగ్యమే మహాభాగ్యమని ఐఆర్సిఎస్ కామారెడ్డి జిల్లా కోశాధికారి దస్థిరాం అన్నారు. ఆయన శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఐ ఆర్ సి ఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.మనం ఆరోగ్యంగా వుండాలంటే స్వచ్చ మైన తాగునీరు, పరిశుభ్రమైన వాతారణం, పుష్టికరమైన ఆహారం తీసుకోవాలని ఆయన తెలిపారు. యోగా చేయాలన్నారు. వాకింగ్, రన్నింగ్ లాంటి శారీరక వ్యాయామాలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి ఇంటికి ఖచ్చితంగా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా ఐ ఆర్ సి ఎస్ ఆధ్వర్యంలో కేజీబీవీ పాఠశాలవిద్యార్థినిలకు ఆరోగ్య దినోత్సవం వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. విజేతలకు ప్రథమ బహుమతి కే .శ్రద్ధ (9వ తరగతి )వెయ్యి రూపాయలు, ఒక డిక్షనరి ,ద్వితీయ బహుమతి పూజ( 9వ తరగతి )600 రూపాయలు, ఒక డిక్షనరీ, తృతీయ బహుమతి నందిని (8వ
తరగతి) 500 రూపాయలు ,ఒక డిక్షనరి బహుమతి గా అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక పిఎసిఎస్ చైర్మన్ నాగల్ గిద్దే శివానంద్ , స్ధానిక సర్పంచ్ రవి పటేల్ ,ఐఆర్సిఎస్ చైర్మన్ ఉమాకాంత్, మారుతి గోరఖ్నాథ్ , ప్రిన్సిపాల్ అశ్విని, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.